బాల్‌థాకరేగా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

15 Dec, 2017 19:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బాల్‌థాకరే బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ టైటిల్‌ రోల్‌ పోషించనున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌ సందర్భంగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగుచూడనున్నాయి. అత్యంత ఆర్భాటంగా జరగనున్న ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌కు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యఅతిధిగా హాజరవనున్నారు.

ఈ బయోపిక్‌కు రాజ్యసభ ఎంపీ, శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ స్ర్కిప్ట్‌ సమకూర్చుతున్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై సంజయ్‌ రౌత్‌ పనిచేస్తున్నారు. బాల్‌ థాకరేతో తనకున్న సుదీర్ఘ అనుబంధంతో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ తనకు తెలుసని, వీటిని ప్రజారంజకంగా తెరకెక్కిస్తానని రౌత్‌ చెప్పారు.

బాల్‌ థాకరే కుటుంబ సభ్యులు సహా ఏ ఒక్కరి జోక్యం లేకుండా మూవీని వాస్తవాల ఆధారంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు