కోలీవుడ్‌ టు బాలీవుడ్‌

6 Jan, 2020 03:16 IST|Sakshi
పార్తిబన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

ప్రాంతీయ భాషల్లో హిట్‌ అయిన సినిమాలు హిందీలో రీమేక్‌ అవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా అదే జాబితాలో తమిళ చిత్రం ‘ఒత్తా సెరుప్పు సైజ్‌ 7’ కూడా చేరనుంది. ఈ సినిమా త్వరలో హిందీలో రీమేక్‌ కానుంది. కేవలం ఒకే ఒక్క పాత్రతో రూపొందిన ‘ఒత్తా సెరుప్పు సైజ్‌ 7’లో నటించడమే కాకుండా, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు తమిళ దర్శకుడు పార్తిబన్‌. హిందీ రీమేక్‌లో ఆ పాత్రను నవాజుద్దీన్‌ సిద్ధిఖీ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు