తమ్ముడిపై ఫిర్యాదు.. నటుడి స్పందన

5 Jun, 2020 14:00 IST|Sakshi

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉంటుంది. ముందుగా న‌వాజుద్దీన్‌పై ఆయన భార్య అలీయా సిద్ధిఖీ ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. తాజాగా ఆయ‌న‌ తమ్ముడు ..తనను లైంగికంగా వేదించాడంటూ కూతురు వరసయ్యే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాల గురించి న‌వాజుద్దీన్‌ను ప్రశ్నించగా.. ‘నా గురించి, నా కుటుంబం గురించి ఆందోళన పడుతున్నందుకు ధన్యవాదాలు. దీని గురించి నేను ఏం మాట్లాడదల్చుకోలేదు’ అ‍న్నారు. ఆయన త‌మ్మ‌డు ష‌మాస్ సిద్ధిఖీ మాత్రం ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

‘కొంద‌రు చ‌ట్టాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. రెండేళ్ళ క్రితం ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పేరు లేదు. కాని ఢిల్లీ పోలీసుల‌కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కొత్త‌గా చేర్చారు. ఈ అస‌త్య ప్ర‌చారాల‌ని మీడియాలో ప్రచారం చేయడం వెనుక ఓ వ్యక్తి ఉంద‌నే విష‌యం స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో నిజం బయటపడుతుంది’ అంటూ ష‌మాస్ ట్వీట్‌ చేశారు.(నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు)

ఇదిలా ఉండగా  కేసు విత్‌డ్రా  చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని సదరు మహిళ ఆరోపించింది. సిద్ధిఖీ బంధువు ఒకరు తనకు ఫోన్‌ చేసి కేస్‌ వాపస్‌ తీసుకోవాలని.. లేకపోతే కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరించాడని తెలిపింది. (‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు