క్షమాపణలు చెప్పిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

31 Oct, 2017 08:46 IST|Sakshi

సాక్షి, సినిమా : విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఎట్టకేలకు వివాదాలకు పుల్‌స్టాప్‌ పెట్టాడు. తన ఆత్మకథ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. పుస్తకంలో సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

దీంతో ట్విట్టర్‌లో సిద్ధిఖీ స్పందించాడు. క్షమాపణలు తెలియజేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. ‘‘నా జ్ఞాపకాలు(పుస్తకం) ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి. నా పుస్తకాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నా’’ అని ప్రకటించాడు. ఆన్‌ ఆర్డినరీ లైఫ్‌​ పేరిట సిద్ధిఖీ రాసిన పుస్తకంపై ఆయన మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్‌, సునీత రాజ్‌వర్‌లు మండిపడ్డారు. పుస్తకం అమ్ముడు పోయేందుకు సిగ్గు లేకుండా కల్పితాలతో అబద్ధపు కథనాలు రాశాడంటూ తీవ్రంగా విమర్శించారు. 

నిహారిక అయితే ఓ అడుగు ముందుకేసి నటుడిపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్‌ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. సిద్ధిఖీ పిచ్చి ఆలోచనలను భరించలేకే అతనికి దూరమైనట్లు మొదటి ప్రేయసి సునీత చెప్పటం విశేషం.

I m apologising 2 every1 who's sentiments r hurt bcz of d chaos around my memoir #AnOrdinaryLife
I hereby regret & decide 2 withdraw my book

మరిన్ని వార్తలు