అందాల ఆరబోతకు నయనతార రెడీ!

25 Oct, 2013 14:59 IST|Sakshi
అందాల ఆరబోతకు నయనతార రెడీ!

అందాల ఆరబోతకు నయనతార వెనకాడడం లేదు. ఈ క్రేజీ హీరోయిన్ ఇంతకముందు చాలా చిత్రాలలో గ్లామరస్‌గా నటించింది. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాజాగా నటిస్తున్న అనామిక చిత్రంలో మరింత గ్లామరస్‌గా కనిపించనుందట. తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న అనామిక కు బాలీవుడ్‌లో విశేష ప్రజాదరణ పొందిన కహాని చిత్రం ఆధారం. హిందీలో విద్యాబాలన్ హీరోయిన్. భర్త కోసం వెతుకుతున్న గర్భిణి పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా నటించింది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళభాషల్లో తెరకెక్కించడానికి శేఖర్ కమ్ముల నిర్ణయిచారు. హీరోయిన్ పాత్రకు నయన్‌ను ఎంపిక చేశా రు. జాతీయ అవార్డే లక్ష్యంగా నయనతార ఈ చిత్రంలో నటిస్తోందట. అదే సమయంలో అందాల ఆరబోత శ్రుతి మించిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. యూనిట్ సభ్యులను బయటకు పంపించి మరీ గ్లామరస్ సన్నివేశాలను తెరకెక్కించారని టాక్. మొత్తం మీద నయనతారను  ప్రేక్షకులు మరోమారు గ్లామర్ పాత్రలో చూడనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి