ఫ్యాక్ట్‌‌ : నయన్‌-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?

21 Jun, 2020 18:43 IST|Sakshi

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వార్తలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీ విషయంలో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలిందంటూ సోషల్‌ మీడియాలో రకరకాలు వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే అందులో కొన్ని నిజమైనవి కాగా, మరికొన్ని సత్య దూరంగా ఉంటున్నాయి. తాజాగా లేడి సూపర్‌స్టార్‌ నయనతా, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌లకు కరోనా పాజటివ్‌గా తేలిందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో వారి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.(చదవండి : గుడిలో నయన్‌-శివన్‌ల వివాహం..!)

ఈ క్రమంలో ఆ వార్తలపై నయన్, విఘ్నేశ్‌ల అధికార ప్రతినిధి స్పందించారు. నయన్‌, విఘ్నేశ్‌లకు కరోనా సోకిందనే వార్తలను ఖండించారు. వారిద్దరు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. అభిమానులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. దీంతో నయన్‌, విఘ్నేశ్‌లకు కరోనా సోకిందని జరగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. కాగా, గత నాలుగేళ్లుగా విఘ్నేశ్‌, నయన్‌లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా నయన్‌, విఘ్నేష్‌లకు సంబంధించి ఎదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. కొద్ది రోజుల కిందట నయన్‌, విఘ్నేశ్‌లు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. చాలా సింపుల్‌గా అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వారు ఒకటి కాబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిపై నయన్‌, విఘ్నేష్‌ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (చదవండి : అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా