విఘ్నేష్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నయనతార

30 Nov, 2019 17:10 IST|Sakshi

నయనతార తన బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేష్‌ శివన్‌తో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. అయితే నయయనతార సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు కలిసి అమెరికాలో తమ స్నేహితులతో కలిసి ఉత్సాహంగా గడిపిన ఫోటోలను విఘ్నేష్‌ శివన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. డెనిమ్‌ బ్లూ షర్ట్‌, బ్లాక్‌ లెదర్‌ స్కర్ట్‌, లూస్‌ హెయిర్‌తో ఉన్న నయన్‌ కొత్త లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేగాక విఘ్నేష్‌, నయన్‌లు తమ స్నేహితులతో గడిపిన క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు.  

'థాంక్యూ అండ్‌ లవ్‌ యూ విఘ్నేష్‌. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితులతో కలిసి వేడుకను జరుపుకోవడం ఆనందం పంచిందని' నయన వెల్లడించారు. అయితే కొన్ని రోజుల క్రితం నయనతార పుట్టినరోజును న్యూయార్క్‌ సిటిలో ఘనంగా జరుపుకున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని కాబోయే భర్త విఘ్నేష్‌ నయన్‌ వేలికి డైమండ్‌ రింగ్‌ను తొడిగారు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి న్యూయార్క్‌లో దిగిన ఫోటోను కూడా షేర్‌ చేశారు. ' న్యూయార్క్‌ సిటీ ఈరోజు నాకు చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నా దిల్‌ కా లవ్‌ నయన్‌ బర్త్‌డే. ఆమె నవ్వు నా మదిని దోచుకుంటుందని ' విఘ్నేష్‌ పేర్కొన్నారు. 

మిలింద్ రౌ దర్శకత్వం వహించనున్న నేత్రికన్‌ తమిళ చిత్రంలో నయనతార నటిస్తుండగా, ఈ చిత్రానికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేష్‌ శివన్‌ మొదటిసారి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు విఘ్నేష్‌ శివన్‌ తన తదుపరి చిత్రాన్ని శివ కార్తికేయన్‌తో చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు