ఇలా తొలిసారిగా క‌నిపిస్తోన్న‌ న‌య‌న‌తార‌

4 Jun, 2020 17:11 IST|Sakshi

లేడీ సూప‌ర్ స్టార్‌ న‌య‌న‌తార ఆదిశ‌క్తిగా క‌నిపించ‌నుంది. ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ "ముఖ్తి అమ్మాన్‌" చిత్రంలో ఆమె దేవ‌త పాత్ర‌ను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుద‌ల చేసింది. ఇందులో పెద్ద పెద్ద ఆభ‌ర‌ణాలు ధ‌రించిన‌ న‌య‌న‌తార ఓ చేతిలో త్రిశూలం ప‌ట్టుకుని ఎరుపు, ఆకుప‌చ్చ చీరలో ప్ర‌కాశ‌వంతంగా మెరిసిపోతోంది. అమ్మ‌వారి అవ‌తార‌మెత్తిన న‌య‌న‌తార ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అమ్మ‌వారిగా న‌య‌న‌తార సరిగ్గా స‌రిపోయిందంటూ ఆమె అభిమానులు పేర్కొంటున్నారు  కాగా న‌య‌న‌తార ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో పాత్ర‌ల్లో న‌టించింది కానీ, అమ్మ‌వారిగా క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి. (అమ్మా.. లవ్‌ యూ.. నయన్‌ తల్లికి విఘ్నేశ్‌ శివన్ విషెస్‌)

ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు ఆర్జే బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక‌ చిత్రమేన‌ని తెలిపారు. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగిన భ‌క్తి చిత్రాల్లో ఉన్న అంశాల‌న్నీ ఇందులోనూ ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఊర్వ‌శి, స్మృతి వెంక‌ట్‌, అజ ఘోష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇశారి కె గ‌ణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం స‌మ‌కూర్చారు. ఇదిలా వుండ‌గా న‌య‌న‌తార‌, స‌మంత హీరోహీరోయిన్లుగా, విజ‌య్ సేతుప‌తి హీరోగా త‌మిళంలో ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ సినిమా తెర‌కెక్కనుంది. దీనికి న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా న‌య‌న‌తార లాక్‌డౌన్‌కు ముందు ర‌జ‌నీకాంత్ "ద‌ర్బార్" చిత్రంలో చివ‌రిసారిగా క‌నిపించిన విష‌యం తెలిసిందే. (స్టార్‌ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా