పరోటాకి గ్రీన్‌ సిగ్నల్‌!

25 Mar, 2017 00:57 IST|Sakshi
పరోటాకి గ్రీన్‌ సిగ్నల్‌!

నయనతార పరోటాకి పచ్చజెండా ఊపారు. అయితే ఇది తినే పరోటా కాదు. తమిళంలో ‘పరోటా  సూరి’ అని ఓ కమెడియన్‌ ఉన్నారు. అతని ఇంటి పేరు పరోటా కాదు. ‘వెన్నిలా కబడ్డీ కుళు’ అనే సినిమాలో ‘పరోటా ఛాలెంజ్‌’ సీన్‌ ఒకటుంది. ఆ సీన్‌ చాలా ఫేమస్‌ అయింది. దాంతో సూరి ఇంటి పేరు పరోటా అయింది. కమెడియన్‌గా దూసుకెళుతున్న ఇతగాడి సరసన స్టార్‌ హీరోయిన్‌ నయనతార నటిస్తారని ఎవరూ ఊహించరు. కానీ, నయనకి కథ నచ్చడంతో సూరితో నటించడానికి అంగీకరించారట.

పోనీ ఈ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్‌ ఏమైనా తెరకెక్కిస్తారా? అనుకుంటే అదీ కాదు. ఓ కొత్త దర్శకుడు రూపొందించనున్నారట. అతను చెప్పిన కథ, క్యారెక్టర్‌ నచ్చడంతో నయనతార మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా సమ్మతించారని కోలీవుడ్‌ టాక్‌. కథ నచ్చితే చాలు హీరో, దర్శకుడు ఎవరు? అనేది నయన ఆలోచించడంలేదని అర్థమవుతోంది. ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ మూవీ అని చెన్నై కోడంబాక్కమ్‌ టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి