మరోసారి దెయ్యం కథతో నయన్‌

6 Feb, 2018 08:38 IST|Sakshi

తమిళసినిమా: హర్రర్‌ చిత్రాలు లాభాలను తెచ్చిపెడుతున్న రోజులివి. అంతేకాకుండా అగ్రతార నయనతారకు కలిసొచ్చిన ట్రెండీ కథలు కూడా. మాయ చిత్రంతో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ నాయకిగా టర్న్‌ అయిన ఈ సంచలన నటికి ఆ చిత్రం సక్సెస్‌ను అందించింది. అలాంటి కథతో తెరకెక్కిన ‘డోర’ చిత్రం ఆశించిన విజయాన్ని అందించనప్పటికీ నయన్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ‘అరమ్‌’ చిత్రంతో నయన్‌ స్థాయి మరింత పెరిగింది. దీంతో మళ్లీ హర్రర్‌ కథలో నటించడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. సార్జన్‌ అనే వర్థమాన దర్శకుడు మోగాఫోన్‌ పట్టనున్నాడు. ఈయన ఇటీవల ‘మా’అనే లఘు చిత్రంతో సామాజిక మాద్యమాలు, సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు.

అంతకు ముందు కూడా లక్ష్మీ అనే లఘు చిత్రాన్ని రూపొందించి అభినందనలు అందుకున్నారు. తాజాగా ఈయన నటుడు సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘హెచ్చరికై ఇది మనిదర్‌గళ్‌ నడమాడుం ఇడం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అరమ్, గులేబకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజీఆర్‌ స్టూడియోస్‌ సంస్థ మూడో చిత్ర నిర్మాణానికి సిద్ధమైంది. అరమ్‌ తరువాత మరోసారి నయన్‌తో హర్రర్‌ కథా చిత్రాన్ని రూపొందించనుంది. దీనికి సార్జాన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోమవారం అధికారికంగా వెల్లడించారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయన్‌ను వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌  చిత్రాలు వరించడం విశేషం. నయన్‌ నటించిన తరువాత విడుదలయ్యే చిత్రం ఇమైకా నోడిగళ్‌ అవుతుందని సమాచారం. ఇందులో ఈ బ్యూటీ సీబీఐ అధికారిగా నటిం చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు