నాయకాకి నాయికగా!

12 Mar, 2020 05:04 IST|Sakshi
నయనతార

సంవత్సరానికి దాదాపు అరడజను సినిమాలు తగ్గకుండా చేస్తున్నారు నయనతార. ఈ ఏడాది ఇప్పటికే తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తున్నారామె. ఇప్పుడు శాండిల్‌వుడ్‌ నుంచి ఓ కబురు వచ్చిందట. కన్నడంలో చాలెంజింగ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న దర్శన్‌ నటించనున్న ‘గండుగాలి మడకరి నాయకా’ సినిమాలో నయనను కథానాయికగా అడుగుతున్నారుని సమాచారం. ఇది చారిత్రాత్మక సినిమా. భారీ బడ్జెట్‌తో రాజేంద్రసింగ్‌ బాబు దర్శకత్వంలో రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించనున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తే బాగుంటుందని అనుకుని, ఈ బ్యూటీని సంప్రదించారట కూడా. ఇక అగ్రిమెంట్‌లో ఆమె సైన్‌ పెట్టడమే ఆలస్యం అని భోగట్టా. ఒకవేళ నయన ఈ సినిమా ఒప్పుకుంటే పదేళ్ల తర్వాత మళ్లీ ఆమె కన్నడ సినిమాలో నటించినట్లవుతుంది. 2010లో ఉపేంద్ర సరసన నయనతార కన్నడంలో ‘సూపర్‌’ అనే సినిమాలో నటించారు.

మరిన్ని వార్తలు