కాదు.. కాదు.. కానే కాదు

22 Jun, 2018 01:11 IST|Sakshi

నహీ.. నహీ.. కాదు.. కాదు.. కానే కాదు అంటున్నారు నయనతార. ఎందుకీ నహీ అంటే.. బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేశ్‌ శివన్‌ కోసం నయనతార నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మిస్తున్నారు అనే వార్తలు బయటకు వచ్చాయి. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో అధర్వ  మురళి హీరోగా ‘ఇదయం మురళీ’ (అధర్వ తండ్రి మురళీ ఒకప్పుడు నటించిన హిట్‌ మూవీ ‘ఇదయం’) అనే టైటిల్‌తో రూపొందనున్న సినిమాను నయన ప్రొడ్యూస్‌ చేయనున్నారని చెన్నై మీడియాలో హాట్‌ టాక్‌ అయింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నయనతార స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్‌తో ఓ సినిమా, ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీతో పాటు తెలుగులో చిరంజీవి పక్కన ‘సైరా’ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు నయన. ఆలాగే తను నటించిన ‘కోలమావు కోకిల’ రిలీజ్‌కు రెడీగా ఉంది. సో... నయన ఫోకస్‌ అంతా యాక్టింగ్‌ మీదే కానీ ప్రొడక్షన్‌ వైపు లేదని ఊహించవచ్చు.

మరిన్ని వార్తలు