లారెన్స్ సరసన?

6 May, 2016 00:27 IST|Sakshi
లారెన్స్ సరసన?

కథ, పాత్ర నచ్చితే స్టార్ హీరో కాకపోయినా నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అందుకు ఉదాహరణ తమిళ చిత్రం ‘మాయ’. అందులో ఆరి అనే నూతన హీరో సరసన జతకట్టారు నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ ఓ తమిళ చిత్రంలో లారెన్స్ సరసన నటించడానికి అంగీకరించారట. ‘కాంచన’ సీక్వెల్స్‌తో హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న లారెన్స్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఇప్పటికే రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారాయన.