నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

7 Apr, 2020 00:48 IST|Sakshi
అమృతా అయ్యర్‌, ప్రదీప్‌ మాచిరాజు

యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృతా అయ్యర్‌ కథానాయికగా నటించారు. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మించారు. అనూప్‌ రూబె¯Œ ్స సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాట 100 మిలియన్ల వ్యూస్‌ దాటినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మున్నా, ఎస్వీ బాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటతో సహా అన్ని పాటలనూ చంద్రబోస్‌ రాశారు.

ప్రదీప్, అమృతలపై చిత్రీకరించిన ‘నీలి నీలి ఆకాశం’ పాట పది కోట్ల వ్యూస్‌ దాటడం చాలా ఆనందంగా ఉంది. అనూప్‌ సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం, సిద్‌ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్‌ చేశాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. కాగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని జీఏ2, యూవీ క్రియేష¯Œ ్స సంస్థలు విడుదల చేయనున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు