ఆ విషయం విని షాక్‌ అయ్యా!

18 Apr, 2019 17:10 IST|Sakshi

తమ కూతురి విడాకుల విషయం విని షాక్‌కు గురయ్యామని బాలీవుడ్‌ ప్రముఖ నటి నీనా గుప్తా అన్నారు. నీనా గుప్తా ఇటీవలే బదాయి హో చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా ఫిల్మ్‌ ఫేర్‌ (క్రిటిక్స్‌) బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురి విడాకులకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితమే తమకు ఈ విషయం తెలిసిందని అన్నారు. తన కూతురు మసాబా గుప్తా, అల్లుడు మధు మంతెన మార్చిలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే.. మధు ఎంతో మంచి వాడని, ఇప్పటికీ తమకు అతనంటే ఎంతో ఇష్టమని, ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని తన కూతురితో చెప్పినట్లు వివరించారు. వాళ్లిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమేనని, బాగా ఆలోచించుకునే విడాకులు కోరుకుంటున్నారని అన్నారు. నీనా గుప్తా తాజాగా ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. కంగనా రనౌత్‌ ‘పంగా’లో కూడా నటించనున్నారు.

మరిన్ని వార్తలు