ప్చ్‌... ఒక్క ధోనీ తప్ప!

19 Feb, 2018 11:41 IST|Sakshi
దర్శకుడు నీరజ్‌ పాండే (ఫైట్‌ ఫోటో)

సాక్షి, సినిమా : స్ట్రాంగ్‌ కంటెంట్‌తో సినిమాలు తెరకెక్కిస్తాడనే పేరు బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండేకు ఉంది. ముఖ్యంగా దేశభక్తి సందేశం ఆయన చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 44 ఏళ్ల ఈ బిహార్‌ బాబు తన పదేళ్ల కెరీర్‌లో రైటర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా 12 చిత్రాలకు పని చేశాడు. అందులో దర్శకత్వం వహించింది కేవలం ఐదింటికి మాత్రమే. అన్నీ కూడా విమర్శకుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి తప్ప కమర్షియల్‌ గా మాత్రం హిట్లు కాలేకపోతున్నాయి.

2008లో ఎ వెడ్‌నస్‌ డే(తెలుగులో కమల్‌ హీరోగా తెరకెక్కిన ఈనాడు) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన నీరజ్‌.. తర్వాత ఐదేళ్లకు స్పెషల్‌ ఛబ్బీస్‌తో పలకరించాడు. తర్వాత వరుసగా బేబీ, ఎంఎస్‌ ధోనీ:ది అన్‌టోల్డ్‌ స్టోరీ, తాజాగా అయ్యారీ చిత్రాలతో పలకరించాడు. అయితే ఆసక్తికర కథనాలు, ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లే తో సినిమాలు తెరకెక్కిస్తాడన్న పేరున్న ఆయన.. కలెక్షన్ల విషయంలో మాత్రం అంతగా సక్సెస్‌ కాలేకపోతున్నాడు. ఒక్క ధోనీ బయోపిక్‌ తప్పించి ఆయన చిత్రాలేవీ వంద కోట్లు దాటలేకపోయాయి.

ఏ వెడ్‌నస్‌డే చిత్రం ఫుల్‌ రన్‌లో రూ. 12 కోట్లు, స్పెషల్‌ ఛబ్బీస్‌ రూ. 66.8 కోట్లు, భారీ అంచనాల నడుమ వచ్చిన బేబీ చిత్రం రూ. 95.56 కోట్లు వసూలు చేశాయి. ఒక్క ధోనీ చిత్రం మాత్రం రూ. 133.04  కోట్లు సాధించి నీరజ్‌ కెరీర్‌లో హయ్యెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఈ మధ్య రిలీజ్‌ అయిన అయ్యారీ కూడా వీక్‌ కలెక్షన్లతోనే ప్రదర్శితమవుతోంది. రెండు రోజులకు గానూ ఈ చిత్రం కేవలం రూ.7.40 కోట్లు వసూలు చేసింది. కంటెంట్‌ బాగానే ఉన్నప్పటికీ అది ప్రేక్షకులను మెప్పించటంలో విఫలమైందన్న టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి కంటెంట్‌ హిట్‌.. కమర్షియల్‌ ఫెయిల్యూర్స్‌తో నీరజ్‌ పాండే జర్నీ సాగుతుదన్నమాట. (ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సౌజన్యంతో...)

మరిన్ని వార్తలు