వారెవా.. ఏమి చాన్సు!

21 Jan, 2018 03:57 IST|Sakshi

మలయాళ ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ నివీన్‌ పౌలీ ప్రస్తుతం ‘వారెవా ఏమి చాన్సు’ అని సంబరపడిపోతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే.. నివీన్‌ పౌలీ, ప్రియా ఆనంద్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాయమ్‌ కులమ్‌ కొచ్చున్ని’. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మోహన్‌లాల్‌ను సంప్రదించడం, ఆయన ఒప్పుకోవటం జరిగిపోయింది. ఈ విషయాన్ని నివీన్‌ పౌలీ ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు.

‘‘కాయమ్‌ కులమ్‌ కొచ్చున్ని’ సినిమాలో మోహన్‌లాల్‌గారు కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఆయన నటించడానికి ఒప్పుకోవడంతో మా టీమ్‌ అందరం చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఇదొక పీరియడ్‌ ఫిల్మ్‌. 19వ శతాబ్దంలో ‘కాయమ్‌ కులమ్‌’ అనే వ్యక్తి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివీన్‌ పౌలీ కాయమ్‌ కులమ్‌గా కనిపించనుండగా మోహన్‌లాల్‌ ‘ఇత్తికర పక్కి’ అనే రోల్‌లో కనిపించనున్నారట. రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గోకులం గోపాలం నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు