నా ఐదుగురు బాయ్‌ ఫ్రెండ్స్ అతనే..‌

11 May, 2020 10:46 IST|Sakshi

లాక్‌డౌన్‌ వేళ సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక రోజువారి తమ వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. దీనిలో భాగంగానే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ నటీ నేహా ధుపియా మే10 (ఆదివారం) మదర్స్‌ డే సందర్భంగా తన భర్త అంగద్‌ బేడీతో దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘హ్యాపీ యానివర్సరీ మై లవ్‌​.. మనం ఒకటై రెండేళ్లు అవుతోంది. అంగద్‌.. నా జీవితానికి ప్రేమ ఇచ్చిన వ్యక్తి . నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాడు. మంచి తండ్రిగా ఉంటారు. నాకు ఆత్మీయ స్నేహితుడు. ఎప్పుడూ నాకు కోపం తెప్పించే సహచరి. ఇలా ఐదుగురు బాయ్‌ ఫ్రెండ్స్‌ను అతనిలో నేను కలిగి ఉన్నాను. అది నా ఎంపిక’  అంటూ ఆమె కామెంట్‌ చేశారు. ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను’  అంటూ నేహా భర్త అంగద్‌ రిప్లే ఇచ్చాడు.

ప్రస్తుతం ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ 2018లో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఈ జంట ఓ పాపకు జన్మనిచ్చింది. అదేవిధంగా భర్త అంగద్‌ తనతో సరదాగా గొడవ పడ్డా.. ఒకరినొకరం అర్థం చేసుకుంటామని ఆమె తెలిపారు. అంగద్‌ చాలా సరదాగా ఉండే వ్యక్తి అని, పలు సందర్భాల్లో తన ఊహకు అందనంత ఫన్‌గా ఉంటారని నేహా చెప్పుకొచ్చారు. మదర్స్‌ డే రోజే నేహా, అంగద్‌ జంట రెండవ వివాహ వార్షికోత్సవం కావటం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు