పాడినందుకు పైసా ఇవ్వ‌రు: ప్ర‌ముఖ‌ సింగ‌ర్‌

10 Apr, 2020 19:37 IST|Sakshi

ఉత్తిపుణ్యానికి ఎవ‌రూ ఏ ప‌ని చేసి పెట్ట‌రు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు. త‌మ పారితోషికం విష‌యంలో పైసా త‌క్కువైనా ఒప్పుకోరు. అలాంటిది ఓ సింగ‌ర్ మాత్రం త‌ను పాట‌లు పాడినందుకు పైసా కూడా ముట్టదంటోంది, సినిమాల్లో ఉచితంగానే పాట‌లు పాడ‌తానంటోంది. తానొక్క‌రే కాద‌ని, బాలీవుడ్‌లో దాదాపు అంద‌రి పరిస్థితి ఇంచుమించుగా ఇదే విధంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఓ గ‌ర్మీ, ఆంఖ్ మేరే, సాఖి, దిల్‌బ‌ర్ రీమిక్స్‌, కాలా చ‌ష్మా.. వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ పాట‌ల‌తో అంద‌రికీ సుప‌రిచితురాలిగా నిలిచిన బాలీవుడ్ గాయ‌ని నేహా క‌క్క‌ర్‌ ఈ సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. బాలీవుడ్‌లో పాట‌లు పాడినందుకు గానూ గాయ‌నీ గాయ‌కుల‌కు చిల్లిగ‌వ్వ ఇవ్వ‌ర‌ని చెప్పుకొచ్చింది. (‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’)

తాము పాడిన పాట సూప‌ర్ హిట్ అయ్యిందంటే ఆ త‌ర్వాత ఎన్నో షోలు మ‌మ్మ‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తాయ‌ని త‌ద్వారా ఎంతో డ‌బ్బు సంపాదిస్తామ‌ని భావిస్తార‌ని చెప్పుకొచ్చింది. తానైతే లైవ్ క‌న్స‌ర్ట్‌, టీవీ ప్రోగ్రామ్స్ ఇలా ఎన్నో మార్గాల‌ ద్వారా మంచి ఆదాయాన్ని గ‌డిస్తున్నానంది. కానీ అంద‌రి ప‌రిస్థితి అలా లేద‌ని చెప్పుకొచ్చింది. కాగా ప్ర‌స్తుతం ఆమె ర్యాప్ సింగ‌ర్ యోయో హ‌నీ సింగ్‌తో క‌లిసి "మాస్క్యో సుక" అనే పాట‌లో క‌నిపించ‌నుంది. ఇది ర‌ష్య‌న్‌, పంజాబీ భాష‌ల‌ క‌ల‌యిక‌లో రూపొందుతోంది. ఇదిలా ఉండ‌గా ఆమె ఇటీవ‌లే ఉత్తరాఖండ్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. (విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా