స్నేహితుల కోసమే!

2 Jul, 2019 10:10 IST|Sakshi

నెంజముందు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాన్ని స్నేహితుల కోసమే నిర్మించినట్లు నటుడు శివకార్తికేయన్‌ పేర్కొన్నారు. హీరోగా బిజీగా ఉన్న ఈయన ఎస్‌కే.ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్ర నిర్మాణం చేపట్టి తొలి ప్రయత్నంగా కనా చిత్రాన్ని నిర్మించి సక్సెస్‌ అయ్యారు. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటి ఐశ్వర్యరాజేశ్‌ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల నాయకి గా దూసుకుపోతున్నారు . ఆ చిత్రం ద్వారా తన చిరకాల మిత్రుడు అరుణ్‌రాజా కామరాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు.

కాగా మలి ప్రయత్నంగా నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తన స్నేహితులైన యూ ట్యూబ్‌ టీమ్‌ను వెండితెరకు పరిచయం చేశారు. బుల్లితెర నటుడు రియోను హీరోగా పరిచయం చేశారు. షిరిన్‌ కంచ్వాలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆర్‌జే.విఘ్నేశ్, రాధారవి, నాంజిల్‌ సంపత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్‌ వేణుగోపాల్‌ దర్శకత్వం వహించాడు. షబ్బీర్‌ సంగీతం, యుకే.సెంథిల్‌కుమార్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం జూన్‌ 14న విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందింది.

దీంతో చిత్ర యూనిట్‌ ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన స్నేహితులను ప్రోత్సహించేందుకే ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలిపారు. చిత్రం విడుదలైన తరువాత తామంతా థియేటర్లకు వెళ్లి అక్కడ ప్రేక్షకుల స్పందనను చూసి చాలా ఆనందించామన్నారు.

చిత్రం చూసిన నటుడు రియో తండ్రి బాగుందంటూ కొడుకుని కౌగిలించుకున్నప్పుడు ఆయన కంటి నుంచి ఆనంద భాష్పాలు కురిశాయన్నారు. అప్పుడు తనకు తన తండ్రి కళ్ల ముందు నిలిచారని శివకార్తికేయన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తన నిర్మాణంలో వాళ్‌ అనే చిత్రం రూపొందుతోందని వెల్లడించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం