‘సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలి’

17 Jul, 2020 15:33 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరుతూ ట్వీట్‌ చేశారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన కారణాలను తాను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే.  సుశాంత్‌ది ఆత్మహత్య కాదంటూ #SSRCaseIsNotSuicide అనే హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌‌​ అవుతోంది. ఈ కేసులో న్యాయం కావాలంటూ అభిమానులు.. సుశాంత్‌ కేసు ఆత్మహత్య కాదు అనే పేరుతో ఉన్న హ్యాష్‌ ట్యాగ్‌ను‌ వైరల్‌ చేస్తున్నారు. (చదవండి: నేను సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ని...)

రియా ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తూ... ‘ఓకే మిస్‌ రియా మీరు సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అని చెబుతున్నారు. అది మేము ఎందుకు నమ్మాలి! ముంబై పోలీసులు సుశాంత్‌ ఆత్మహత్య అంటున్నారు. బాలీవుడ్ కూడా ఇది ఆత్మహత్యే అనుకుంటుంది. అలాగే నువ్వు కూడా ఇది ఆత్మహత్య అనే అనుకుంటున్నావు కదా! కానీ #SSRCaseIsNotSuicide మాకు న్యాయం కావాలి’ అలాగే ‘సుశాంత్‌ ఇంటర్య్వూల్లో కూడా స్పష్టం తెలుస్తోంది. బాలీవుడ్‌లోని నెపోటిజం వల్లే తనని చాలా సినిమాల నుంచి తొలగించారని. అయినప్పటికీ సుశాంత్‌ నటనపై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేదు. అయితే ఇది ఇంకా ఆత్మహత్య అని ప్రజలను మభ్యపెట్టడం మానేయండి’ #SSRCaseIsNotSuicide, ‘సుశాంత్‌ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాము’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు