నటిపై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

13 Mar, 2020 13:35 IST|Sakshi

బాలీవుడ్‌ నటి నేహా ధూపియాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ షోలో తను చేసిన వ్యాఖ్యలకుగాను సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా యువతే లక్ష్యంగా ఓ ఛానల్‌ ‘రోడీస్‌ రెవల్యూషన్‌’ అనే రియాలిటి షోను నిర్వహిస్తోంది. ఈ షోలో మొత్తం అయిదుగురు గ్యాంగ్‌ లీడర్లలో ఒకరైన నేహా ధుపియా.. యువ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను సంబంధిత ఛానల్‌ గురువారం విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఓ యువకుడు తనను మోసం చేసిన తన గర్ల్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు వెల్లడించాడు. తనతో ప్రేమలో ఉన్న సమయంలో ఒకేసారి మరో అయిదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకుందని.. అందుకే తనని చెంపదెబ్బ కొట్టానని చెప్పాడు.(‘అలాంటి వారు వస్తే... కంగనా నటన వదిలేస్తుంది’)

ఆకలిగా ఉందన్నా పట్టించుకోలేదు: నటి

ఈ విషయంపై స్పందించిన నేహా.. ‘‘నువ్వు అలా చేయడం సరైనది కాదు. అమ్మాయి అయిదుగురు అబ్బాయిలతో కలిసి ఉండటం అనేది తన ఇష్టానికి సంబంధించిన విషయం’’ అంటూ సదరు యువకుడిపై విరుచుకుపడ్డారు. దీంతో నేహా వ్యాఖ్యలపై మండిపడుతూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. తనపై మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ.. ఆమె ‘ఫేక్‌ ఫెమినిస్ట్‌’ అని ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. అదే విధంగా.. ‘నేహా అదే తప్పునకు అయిదుగురు అబ్బాయిలను కొట్టినప్పుడు ఒకలా రియాక్ట్‌ అవుతారు... అదే తప్పు చేసిన ఒక అమ్మాయిని కొట్టినప్పుడు మరోలా స్పందిస్తూ.. లింగ భేదం చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాక తను మాటలను అదుపులో పెట్టుకోకపోతే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక రోడీస్‌ షోలో నేహాతో పాటు రణ్విజయ్‌ సింఘా, ప్రిన్స్‌ నరులా, రాఫ్తార్‌తో పాటు నిఖిల్‌లు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో గత నెలలో ప్రారంభమైంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా