స్వీట్ హార్ట్

13 Nov, 2016 23:02 IST|Sakshi
స్వీట్ హార్ట్

‘‘నేత్ర’ చిత్రదర్శకుడు యాదకుమార్ నా శిష్యుడే. నేనిప్పటి వరకు 149 మందిని యాక్టర్స్‌గా తీర్చిదిద్దా. వారిలో తొంభై ఐదు మంది హీరోలయ్యారు. నేను, నా కుమారుడు కలిసి తొలిసారి ఈ చిత్రంలో నటించాం’’ అని వైజాగ్ సత్యానంద్ అన్నారు. గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మించిన చిత్రం ‘నేత్ర’. ‘మై స్వీట్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక.

ఉదయ్‌నాగ్ రతన్ దాస్ స్వర పరచిన ఈ చిత్రం పాటలను నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ‘‘లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. పీరికట్ల రాము, గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల, ఉదయ్‌నాగ్ రతన్ దాస్, నిర్మాత రామ సత్యనారాయణ, నటుడు శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు.