అలాంటి సినిమాలు ఇక చేయను

16 Nov, 2019 08:44 IST|Sakshi

చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు అంటోంది నటి అనుష్క. నిజానికి ఈ అమ్మడికి పేరు తెచ్చిన పాత్రలన్నీ చారిత్రక కథా చిత్రాల్లోనివేనన్నది తెలిసిందే. సూపర్‌ చిత్రంతో టాలీవుడ్‌కు, రెండు చిత్రంతోకోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ యోగా టీచర్‌ తొలి చిత్రాల్లోనే అందాలను విచ్చలవిడిగా పరిచేసింది. అరుంధతి చిత్రం ఈ అమ్మడుకి అనూహ్యంగా మలుపు తిప్పింది. అందులో జేజెమ్మ పాత్రలో అనుష్కరాజసంతో పాటుఅద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఆ తరువాత నటించిన రుద్రమదేవి, బాహుబలి 1, 2 చిత్రాలు నటిగా తారస్థాయిలో కూర్చోబెట్టాయి. ఈ చిత్రాలే ఆమెను హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకిగానిలబెట్టాయి. అలాంటిది చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు బాబూ అంటోందట ఈ బ్యూటీ. ప్రస్తుతం సైలెన్స్‌ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశ్శబ్దంఅనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటిస్తోందని సమాచారం.

మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి అంజలి కూడా ముఖ్యపాత్రలో నటిస్తోంది. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే  రెండు ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేశారు. నటి అనుష్క ఒక ఇంటర్వ్యూలో ఇకపై చరిత్ర కథా చిత్రాల్లో నటించకూడదనినిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ తరహా చిత్రాలను పూర్తి చేయడానికి అధిక రోజులు పడుతోందని, అదీ కాకుండా మేకప్‌కు అధిక సమయం పడుతోందని చెప్పుకొచ్చింది. ఆ తరహా చిత్రాలకు అధిక సమయాన్నికేటాయించడంవల్ల ఆరోగ్యపరంగా అలసటకు గురవుతున్నట్లు తెలిపింది. ఇలాంటి కారణాలతోనే చరిత్ర కథా చిత్రాల్లో నటించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌లో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను  ఆ చిత్రంలో నటించడానికి నిరాకరించినట్లు తాజా సమాచారం. తదుపరి దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో అనుష్క నటించే అవకాశం ఉన్న ట్లు తాజా సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మానుషి చిల్లర్ బాలీవుడ్‌ ఎంట్రీ

గాయపడ్డ హీరోయిన్‌.. మెడకు బ్యాండేజ్‌

రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

సక్కనమ్మ చిక్కింది!

ఒక్కటయ్యారు

దుర్గాపురం వారి నాటక ప్రదర్శన

కార్తీ దొంగ

డబుల్‌ ధమాకా

ట్రాప్‌లో పడతారు

అంధురాలి పాత్రలో...

జోడీ కుదిరింది

ఇంట గెలిచి రచ్చ గెలిచింది

రెట్రో స్టెప్పులు

రెండు కుటుంబాల కథ

డిజిటల్‌ ఎంట్రీ

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

ఆ హీరోను సోషల్‌ మీడియాలో చాలాసార్లు చంపేశారు!

వైభవంగా నటి అర్చన వివాహం

సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను

అమలా ఔట్‌?

మహోన్నతుడు అక్కినేని

హారర్‌ కథ

రెండుగంటలు నవ్విస్తాం

నెక్ట్స్‌ ఏంటి?

రుద్రవీణ చూసి ఇండస్ట్రీకి వచ్చా

ప్రేమ పోరాటం

తీన్‌మార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మానుషి చిల్లర్ బాలీవుడ్‌ ఎంట్రీ

గాయపడ్డ హీరోయిన్‌.. మెడకు బ్యాండేజ్‌

రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

అలాంటి సినిమాలు ఇక చేయను

సక్కనమ్మ చిక్కింది!

ఒక్కటయ్యారు