సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా

11 Jan, 2014 15:33 IST|Sakshi
సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా

'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తండా'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులో అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి చెప్పారు. 'తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారని, మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సురేష్ కొండేటి తెలిపారు. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు.

బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి