అనగనగా ఓ దెయ్యం

31 Jan, 2018 00:35 IST|Sakshi
అరోహి

‘‘ఇప్పటివరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా ‘దెయ్యం చెప్పిన కథ’ చిత్రం హారర్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. మూస ధోరణి కాకుండా విభిన్నమైన కథా, కథనాలతో పూర్తి హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం’’ అని దర్శకుడు ప్రదీప్‌ అన్నారు. నూతన నటీనటులతో ఆయన దర్శకత్వంలో  ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఎస్వీయన్‌రావు సారథ్యంలో ఆరాధ్య ప్రొడక్షన్స్‌ పతాకంపై పెనాక దయాకర్‌రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రదీప్‌ మాట్లాడుతూ– ‘‘దెయ్యం ప్రధాన పాత్రగా సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసేలా ఉంటుంది.

అన్ని సినిమాల్లాగా కమర్షియల్‌ హంగులు, సెట్టింగులు ఉండవు. ఈ చిత్రం ద్వారా 29 మంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నాం. హీరోయిన్‌ అరోహి బాగా యాక్ట్‌ చేసింది’’ అన్నారు. ‘‘చిన్న బడ్జెట్‌లో ప్రదీప్‌ ఈ సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు. చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రదీప్‌ దర్శకత్వంలోనే ‘దెయ్యంతో ఓ రాత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నాం’’ అన్నారు దయాకర్‌రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: నవీన్‌ .జె, కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం: ప్రదీప్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు