గొప్పింటి అమ్మాయి పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే..

22 Jun, 2018 08:25 IST|Sakshi
తవం సెయ్‌దేనోగజనీమురుగన్‌ విష్ణుప్రియ

తమిళసినిమా: గొప్పింటి అమ్మాయి పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే జరిగే పరిణామాలెలా ఉంటాయన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ఎన్న తవం సెయ్‌దేనో. ఒక రాజకీయనాయకుడికి తన ఏకైక కూతురు అంటే వల్లమాలిని ప్రేమ. కూతురి కంటతడి పెడితే అతను తల్లడిల్లిపోతాడు.

అలాంటి గారాల కూతురు ఒక సైకిల్‌ బండిలో ఐస్‌ అమ్ముకునే కుర్రాడిని ప్రేమిస్తే 40 ఏళ్లుగా పెంచుకుంటూ వచ్చిన తన రాజకీయ పరపతి పోగొట్టుకోవడానికి మనస్కరించని తండ్రి ఎంతగానో ప్రేమించే కన్న కూతురినే కడతేర్చడానికి సిద్ధమైతే? ఆ తరువాత జరిగే పరిణామాలెలా ఉంటాయన్నదే ఎన్న తవం సెయ్‌దేనో చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు మురబాసెలన్‌ తెలిపారు. చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాలు తెలిపారు.

దర్శకుడు పేరరసు శిష్యుడైన ఈయన మెగాఫోన్‌ పట్టిన తొలి చిత్రం ఇది. ఇనైంద కైగళ్‌ పతాకంపై ఎస్‌.సెంథిల్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైందని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. గజనీమురుగన్‌ హీరోగానూ, విష్ణుప్రియ కథానాయకిగానూ నటించిన ఇందులో ప్రియామీనన్, పవర్‌స్టార్‌ శ్రీనివాసన్, సింగంపులి, మయిల్‌సామి, ఢిల్లీగణేశ్, ఆర్తీగణేశ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఒక ఐటమ్‌ సాంగ్‌లో నటి రిషా నటించింది. దీనికి సంగీతాన్ని దేవగురు, నేపథ్య సంగీతాన్ని పి.చంద్రకాంత్, ఛాయాగ్రహణం నౌషాత్‌ అందించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా