పాలమూరులో హీరో, హీరోయిన్ల సందడి

18 Oct, 2019 07:57 IST|Sakshi
‘కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌’ సినిమా ప్రమోషన్‌

సాక్షి, మహబూబ్‌నగర్‌: ‘కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌’ సినిమా హీరో, హీరోయిన్లు గురువారం పాలమూరు పట్టణంలో సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని వెంకటాద్రి థియేటర్‌లో కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌ సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా థియేటర్‌ ఆవరణలో హీరో, హీరోయిన్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరోయిన్‌ ఎలిషా ఘోష్‌ మాట్లాడుతూ.. ఇదివరకు వివిధ భాషల్లో తొమ్మిది సినిమాలు నటించానని, తెలుగులో తొలి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందన్నారు.

హీరో కృష్ణంరాజు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని జేపీఈఎన్‌సీ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివానని, అందువల్ల జిల్లా అంటే ప్రత్యేక అభిమానం ఉందని, కళాశాల చైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జేపీఎన్‌సీఈ కళాశాల చైర్మన్‌ కేఎస్‌.రవికుమార్‌ మాట్లాడుతూ ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు మూడో సినిమా చేస్తున్నాడని, గౌతంరాజుతో తనకు ఏన్నో ఏళ్ల నుంచి స్నేహం ఉందన్నారు. సమావేశంలో థియేటర్‌ యజమాని గుద్దేటి శివకుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు