ప్రశ్నించేందుకు..!

31 Oct, 2017 23:46 IST|Sakshi

మనకు అన్యాయం జరిగితేనే ప్రశ్నించాలని ఎవరూ అనుకో కూడదు. ఇతరులకు అన్యాయం జరిగిందని తెలిసినా... ఎవరినైనా ప్రశ్నించి, న్యాయం చేసేలా ప్రతి ఒక్కరూ ముందడుగువేయాలనే సందేశంతో ‘ప్రశ్నిద్దాం’ అనే సినిమా రూపొందనుంది.బద్రీ నాయుడు అబ్బు దర్శకత్వంలో చంద్రబోస్‌ సేవా సమితి సమర్పణలో శ్రీ వెంకటేశ సాయి ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై దాసరి నరసింహ, యార్లగడ్డ లక్ష్మి నిర్మించనున్న చిత్రమిది. ‘‘ప్రశ్నిద్దాం... ఇది మన హక్కు అంటూ నేటి యువత వినిపించే సందేశమే చిత్రకథ. సినిమా ప్రారంభోత్సవాన్ని వినూత్న రీతిలో జరపనున్నాం’’ అన్నారు బద్రీ నాయుడు.

మరిన్ని వార్తలు