ఆట ఆరంభం

23 Jan, 2019 01:20 IST|Sakshi

‘ఆటగదరా శివ’ చిత్రం ఫేమ్‌ ఉదయ్‌ శంకర్‌ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్‌ ఆంటోనీతో తమిళంలో ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం. ఐశ్వర్య రాజేష్‌ కథానాయిక. అధిరో క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కథా చిత్రమిది.

ఆంధ్ర, తెలంగాణతో పాటు విదేశాల్లోనూ షూటింగ్‌ జరపనున్నాం. ఏప్రిల్‌కి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్,  కిరణ్, శరత్‌ మరార్, దర్శకులు చంద్ర సిద్ధార్థ, కరుణాకరన్, కిషోర్‌ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్‌ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్‌ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్‌ స్వరూప్, ప్రదీప్‌ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్‌ ఇలియాస్, కెమెరా: గణేష్‌ చంద్ర.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు