‘నిక్‌.. వీలైనంత తొందరగా ప్రియాంకతో తెగదెంపులు చేసుకో’

6 Dec, 2018 12:08 IST|Sakshi

ప్రియాంక చోప్రాపై ‘ద కట్‌’  జాత్యహంకార కథనం

ప్రియానిక్‌ దంపతుల అనుబంధాన్ని చూసి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందపడుతూ ఉంటే.. అమెరికాకు చెందిన మారియా స్మిత్‌ అనే రైటర్‌కు మాత్రం వీరి జంటను చూసి కన్నుకుట్టినట్టు ఉంది. అందుకే ప్రియాంకపై జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలతో కథనాన్ని రాసుకొచ్చింది.

ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ల ప్రేమ నిజమైందేనా? అనే టైటిల్‌తో రాసిన ఈ కథనంలో..  మొదట ప్రియాంక సూపర్‌స్టార్‌ అంటూ వ్యంగ్యంగా మొదలు పెట్టిన మారియా ఆ తర్వాత ఆమె రేసిస్ట్‌, సెక్సిస్ట్‌, గ్లోబల్‌ స్కామ్‌ ఆర్టిస్ట్‌ అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించింది. అంతేకాకుండా తన ఆనందం కోసమే ప్రియాంక.. నిక్‌ను పెళ్లి పేరుతో బంధించాలని భావించి విజయవంతమైందని పేర్కొంది. ఒకవేళ నిక్‌ తన ఆర్టికల్‌ చదివినట్లైతే వీలైనంత తర్వాత తన భార్యతో తెగదెంపులు చేసుకోవాలని సూచించింది. మీ పెళ్లి ఊరేగింపునకు ఉపయోగించిన గుర్రం ఉంటే ఎక్కి ఆమెకు దూరంగా పారిపో అంటూ సలహా కూడా ఇచ్చింది. వీటితో పాటుగా ప్రియానిక్‌ల ప్రేమకథను ప్రస్తావిస్తూ... ట్విటర్‌లో కాకుండా తనకు పర్సనల్‌గా మెసేజ్‌ పెట్టమని ప్రియాంక చెప్పినపుడే నిక్‌ జాగ్రత్త పడి ఉండాల్సిందని మారియా అభిప్రాయపడింది. నిక్‌ కూడా తన కంటే వయసులోనే పెద్ద వాళ్లైన స్త్రీలతోనే కలిసి ఉండటం ఇష్టమని గత ఇంటర్వ్యూల్లో చెప్పాడని పేర్కొన్న మారియా.. బహుషా అందుకే అతడు ప్రియాంకను పెళ్లాడాడేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.


మారియా స్మిత్‌
అయితే మారియా రాసిన ఈ కథనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ద కట్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘ఈ ఆర్టికల్‌ మా ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. ఎడిటోరియల్‌ రివ్యూలో భాగంగా దీనిని తొలగించాలని నిర్ణయించాం. క్షమాపణ కోరుతున్నాం’ అంటూ న్యూయార్క్‌ మ్యాగజీన్‌కు చెందిన ఈ వెబ్‌సైట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ కథనంపై ప్రియానిక్‌ దంపతులు ఇంతవరకు స్పందించలేదు. అయితే నిక్‌ జోనస్‌ సోదరుడు జో జోనస్‌ సహా సోనమ్‌ కపూర్‌ వంటి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మారియాపై విమర్శలు గుప్పించారు. ఇటువంటి కథనాన్ని వెలువరించినందుకు నిజంగా సిగ్గు పడాలంటూ చురకలు అంటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

ఆ పదానికి లింగ భేదం ఉండదు: తాప్సీ

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’