ఇప్పుడు మేకప్‌ మచ్చీ

8 Aug, 2018 01:09 IST|Sakshi

స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌ అంటూ ఆర్టిస్టులతో యాక్ట్‌ చేయించే గౌతమ్‌ మీనన్‌ ఫర్‌ ఎ చేంజ్‌ మేకప్‌ వేసుకుంటున్నారు. స్టార్ట్‌ కెమెరా అనగానే కెమెరా ముందు నిలబడి డైలాగ్స్‌ చెప్పడానికి రెడీ అయ్యారు. దర్శకుడిగా గౌతమ్‌ ఇచ్చిన ‘ఘర్షణ, ఏ మాయ చేశావె, సాహసం శ్వాసగా సాగిపో’ ఇలా.. యాక్షన్‌ కమ్‌ లవ్‌ స్టోరీస్‌ను అద్భుతంగా చూపించారు గౌతమ్‌. ముఖ్యంగా ప్రేమ కథలకు సున్నితమైన భావోద్వేగాలతో క్లాసిక్‌ టచ్‌ ఇస్తూ తెరకెక్కించగలరనే పేరు ఉంది. నటుడిగా మాత్రం యాక్షన్‌ మూవీలో కనిపించనున్నారు.

తాను దర్శకత్వం వహించే చిత్రాల్లో జస్ట్‌ ఒక్క సీన్‌లో అయినా కనిపించడం గౌతమ్‌ అలవాటు. ఆ మధ్య ‘గోలీసోడా 2’ చిత్రంలో పోలీసాఫీసర్‌గా కీలక పాత్ర చేశారు. ఇప్పుడు ఏకంగా  హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారట. ‘జై’ అనే కొత్త దర్శకుడు ఇటీవల గౌతమ్‌ మీనన్‌ని కలిసి ఓ కథ వినిపించారట. ఆ కథ బాగా నచ్చడంతో హీరోగా నటించడానికి ఒప్పుకున్నారని కోలీవుడ్‌ టాక్‌. ‘నాచ్చియార్‌’ ఫేమ్‌ నాయిక ఇవానా ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించనున్నారట. ఈ నెల 15న ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారని సమాచారం. ఈ వార్త వినగానే గౌతమ్‌ ఫ్యాన్స్‌ ‘ఇప్ప మేకప్‌ మచ్చీ’ అనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడు మేకప్‌ బావా అని అర్థం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు