నో వయోలెన్స్‌

8 Jul, 2018 00:30 IST|Sakshi
ఎన్టీఆర్‌

కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్‌ యాక్షన్‌ మోడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు సంబంధించి ఫైట్‌ సీన్స్‌ కోసమే ఈ సీరియస్‌ మోడ్‌. కానీ నెక్ట్స్‌ షెడ్యూల్‌లో నో వయలెన్స్‌ అట. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై యస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నాగబాబు, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ ఇంకో వారం రోజుల పాటు సాగనుంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై కొన్ని కాలేజ్‌ సీన్స్‌ తీయనున్నారని సమాచారం. ఆ తర్వాత సాంగ్స్, కొన్ని కీలక సన్నివేశాల కోసం పొల్లాచ్చి వెళ్లనుంది చిత్రబృందం. దసరా స్పెషల్‌గా రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

మరిన్ని వార్తలు