వాలెంటైన్స్‌ డే స్పెషల్‌: ప్రియాంక, నిక్‌ జొనాస్‌ డ్యాన్స్‌

15 Feb, 2020 14:54 IST|Sakshi

 బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు వాలెంటైన్స్ డేని గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 14 రోజున నిక్ జోనాస్ త‌న ఇద్ద‌రు సోద‌రుల‌తో క‌లిసి మిలాన్ కాన్స‌ర్ట్ నిర్వ‌హించారు. ఈ కాన్స‌ర్ట్‌కి ముందు నిక్ జోనాస్‌, ప్రియాంకతో కలిసి ఓ పాటకు చిందులు వేశారు.  2018లో ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన సింబా చిత్రంలోని ఆంఖ్ మేరే సాంగ్‌కి త‌మ‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేశారు. ఈ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని నిక్ జోనాస్ శనివారం ఉదయం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నా వాలెంటైన్‌తో ప్రీ షో డ్యాన్స్ పార్టీ’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (‘మారిపోయారు.. గుర్తుపట్టలేకపోతున్నాం!’)

ఇక గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక‌తో నిక్ వేసిన స్టెప్పులు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అంతేగాక ఈ క్యూట్‌ కపూల్‌కి నెటిజన్లు హ్యాపీ వాలెంటైన్స్‌ డే అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మ‌రోవైపు అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్ త‌న ఇద్ద‌రు సోద‌రులు కెవిన్ జోనాస్‌, జో జోనాస్‌లు క‌లిసి మిలాన్‌లో జ‌రిపిన కాన్స‌ర్ట్‌కి భారీగా క్రౌడ్ వచ్చార‌ని వీడియో ద్వారా తెలిపాడు. (ఆ డ్రెస్‌ నాకు బాగా నచ్చింది: ప్రియాంక తల్లి)

Pre show dance party with my forever Valentine. @priyankachopra #valentines

A post shared by Nick Jonas (@nickjonas) on

మరిన్ని వార్తలు