21ఏళ్ల అమ్మాయిలా నటిస్తా: ప్రముఖ నటి

22 May, 2017 20:30 IST|Sakshi
21ఏళ్ల అమ్మాయిలా నటిస్తా: ప్రముఖ నటి
ఆస్కార్ విన్నర్, ప్రముఖ హాలీవుడ్ నటి నికోల్ కిడ్‌మాన్ సుపరిచితురాలే. ఆమె వయసు ఇప్పుడు 49 ఏళ్లు. కానీ కెమెరా ముందుకొచ్చి నటించేటప్పుడు ఆమె అసలు 49ఏళ్ల మహిళల కనిపించరట. 21 ఏళ్ల అమ్మాయిలాగానే తాను నటిస్తానంటోంది నికోల్ కిడ్‌మాన్. కేన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఈమె,  ఎక్కువగా బోల్డ్ ఛాయిస్ లు తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్పింది. తనకు పనిలేకపోయినా.. పనిచేస్తూనే ఉంటానని, సినిమా తన ప్యాషన్ అని కిడ్‌మాన్ తెలిపింది.  ఇటీవల ''ది కిల్లింగ్ ఆఫ్ ది సీక్రేడ్ డీర్' లో సైకలాజికల్ థ్రిల్లర్ హర్రర్ లో కిడ్ మాన్ నటించారు. కిడ్‌మాన్ కు ఇద్దరు పిల్లలు. వారిని కూడా సైకలాజికల్ థ్రిల్లర్ లో చూడాలనుకుంటున్నట్టు కిడ్‌మాన్ చెప్పారు.
 
తను 21 ఏళ్లప్పుడు కెరీర్ ప్రారంభంలో ఎలాగైతే నటించానో ఇప్పటికీ అలాగే నటిస్తానని కిడ్‌మాన్ తెలిపారు. ఈ వయసులో తాను చాలా బోల్డ్ గా, ఓపెన్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నమ్మిన ఫిల్మ్ మేకర్స్ ను సపోర్టు చేస్తున్నానని తన మనసులోని భావాలను వెల్లడించారు.  ''ది కిల్లింగ్ ఆఫ్ ది సీక్రేడ్ డీర్'' లో నటించిన కిడ్‌మాన్, నేత్ర వైద్యురాలు అన్నా మర్ఫీగా నటించారు. ఈ సినిమాను నేడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో  విడుదల చేశారు. నవంబర్ 3న అమెరికాలో విడుదల చేసేందుకు షెడ్యూల్ ప్రీపేర్ చేశారు.