'నా భార్య గ్రేట్ గ్యాంబ్లర్'

5 Apr, 2016 11:10 IST|Sakshi
'నా భార్య గ్రేట్ గ్యాంబ్లర్'

లాస్ ఏంజిల్స్: 'డెడ్ కామ్', 'డేస్ ఆఫ్ థండర్' 'ది అవర్స్' వంటి హాలీవుడ్ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆస్ట్రేలియన్ నటి నికోల్ కిడ్మన్ ను ఉద్దేశించి ఆమె భర్త సంగీతకారుడైన కీత్ ఉర్బన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తరచూ జూదం ఆడే అలవాటున్న నికోల్ ను గ్రేట్ గ్యాంబ్లర్ గా అభివర్ణించాడు కీత్. అయితే తన భర్త చెప్పినట్లు అంత గొప్పగా కాకపోయనప్పటికీ జూదంలో అందెవేసిన చెయ్యేనని ఒప్పుకుందామె.

'జూదం నికోల్ క్రమశిక్షణగా మెలుగుతుంది. ఆ లక్షణమే ఆమెను మంచి జూదగత్తెగా మార్చి ఉంటుంది'అని కీత్ భార్యను పొగిడాడు. 'నేను సంపాదించే డబ్బులో కొంత పక్కకుపెట్టి దానితో జూదం ఆడతాను. ఓ ఛాలెంజ్ విషయమై నా ఇంటిని కూడా జూదంలో పెట్టాలనుకుంటున్నాను' అంటూ గ్యాంబ్లింగ్ పై తనకున్న ప్రేమను దాచుకోకుండా వెల్లడించింది నికోల్ కిడ్ మన్. ఈ జూదం వ్యవహారం ఆ కుటుంబాన్ని ఎక్కడిదాకా తీసుకెళుతుందో వేచిచూడాలిమరి!