ప్రభుదేవాతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నికీషా

13 May, 2018 17:24 IST|Sakshi
ప్రభుదేవాతో నికీషా పటేల్‌(ఫైల్‌ ఫోటో)

సాక్షి, సినిమా: నటి నికీషా పటేల్‌ ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని తన ట్వీటర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది. నికీషా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీకు ఏ హీరో నటన అంటే ఇష్టం అని అడిగితే.. వెంటనే చాలా మంది హీరోల నటన నాకు ఇష్టం. ముఖ్యంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. ఆయన, మా కుటుంబం మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రభుదేవాతో నటిస్తారా అని అడగగా.. సినిమా ఏంటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికైనా రెడీ అని నికీషా పటేల్‌ పేర్కొంది. అది ఇప్పుడు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవడంతో నికీషా దానిపై క్లారిటీ ఇచ్చింది.

‘ప్రభుదేవా గురించి నేను అన్న మాటలపై చాలా వార్తాలు పుట్టుకొస్తున్నాయి. వీటిపై ఓ క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వాటిలో ఎలాంటి నిజం లేదు. నేను నా కుటుంబంతో చాలా బిజీగా ఉన్నాను.’అని తన ట్వీటర్‌లో పేర్కొంది.  ‘ప్రభుదేవా సర్‌ గురించి నేను అన్న మాటలపై చాలా వార్తా పత్రికలు, మీడియా వెబ్‌సైట్‌లు చాలా రకాలుగా వార్తలు రాసేస్తున్నాయి. నేను ప్రభుదేవానే కాదు ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన నాకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమే. నేను ప్రభుదేవాను సర్‌ అని పిలుస్తాను.’ అని తన పీఆర్‌వో రమేష్‌ బాల ట్వీటర్‌ ద్వారా తెలిపారు. 

నికీషాపటేల్ పులి సినిమాలో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. నికీషా పటేల్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం  ‘తేరీ మెహర్బానియా 2’ అనే బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు