18 పేజీల ప్రేమకథ

6 Mar, 2020 02:25 IST|Sakshi
నిఖిల్, అల్లు అర్హా, అల్లు అరవింద్‌

సుకుమార్‌ ప్రేమకథలన్నీ విభిన్నంగా ఉంటాయి. వాటి టైటిల్స్‌ కూడా. సుకుమార్‌ కథా స్క్రీన్‌ప్లే అందిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్‌’. నిఖిల్‌ హీరోగా నటించనున్న ఈ సినిమాకి ‘కుమారి 21ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యకుమార్‌ పల్నాటి దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమా ముహూర్తం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హా క్లాప్‌ ఇవ్వగా, ‘బన్నీ’ వాస్‌ కుమార్తె హన్విక కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి సుకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: యువరాజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శరణ్‌రాపర్తి, బి. అశోక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా