నిఖిల్‌ ‘ముద్ర’ వస్తోంది

10 Aug, 2018 13:54 IST|Sakshi

‘కిరాక్‌ పార్టీ’ మూవీ తరువాత నిఖిల్‌ హీరోగా వస్తోన్న చిత్రం ‘ముద్ర’. తమిళంలో హిట్‌ అయిన కణిథన్‌ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్‌ జర్నలిస్ట్‌ పాత్రను పోషిస్తున్నారు. 

ఆ మధ్య విడుదలైన వర్కింగ్‌ స్టిల్స్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 8న రిలీజ్‌ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఠాగుర్‌ మధు నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు