'కరోనానే కాదు నా పెళ్లిని ఎవరూ ఆపలేరు': హీరో

16 Mar, 2020 18:04 IST|Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన పెళ్లిపై వస్తున్న వదంతులపై స్పందించారు. కరోనా కారణంగా అతని పెళ్లి వాయిదా పడిందనే వార్తలను ఖండించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. నా పెళ్లిపై ఆందోళన అవసరం లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాం అంటూ స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. చదవండి: కరోనా ఎఫెక్ట్‌: రానా ‘అరణ్య’ విడుదల వాయిదా

గత కొద్దికాలం ప్రేమలో ఉన్న డాక్టర్ పల్లవితో సినీ హీరో నిఖిల్ వివాహం గత నెల నిశ్చమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా భయాలు చోటుచేసుకోవడంపై నిఖిల్ స్పందిస్తూ.. 'ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్న నేపథ్యంలో ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే వచ్చేవారానికల్లా పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం' అని నిఖిల్ అన్నారు. చదవండి: ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌: నటుడు 

మరిన్ని వార్తలు