ఒక ఇంటివారయ్యారు

15 May, 2020 05:09 IST|Sakshi
నిఖిల్‌, పల్లవి, మహేష్‌, పావని

గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్‌ డాక్టర్‌ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్‌ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ లోని ఒక ఫార్మ్‌ హౌస్‌ లో నిఖిల్‌ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్‌ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది.

మరిన్ని వార్తలు