నాకిష్టమైన పాట: హీరో నిఖిల్‌ వెడ్డింగ్‌ టీజర్‌

16 May, 2020 20:34 IST|Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రేయసి పల్లవి వర్మను పెళ్లాడాడు టాలీవుడ్‌ హీరో నిఖిల్‌. హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్ట్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా వీరి వివాహం జరిగింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిఖిల్‌ అభిమానులతో పాటు శ్రేయోలాభిలాషులకు అతడి పెళ్లిని నేరుగా చూసే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా తన పసుపు ఫంక్షన్‌, పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన నిఖిల్‌.. తాజాగా తన వెడ్డింగ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు.(వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్‌)

‘‘ప్రతీ ఒక్కరు నా పెళ్లికి రావాలని కోరుకున్నాను.  కానీ కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ వల్ల ఈ వీడియో ద్వారా మాత్రమే మీ ఆశీర్వాదాలు పొందగలనని అనుకుంటున్నాను. నా ఫేవరెట్‌ సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది’’అంటూ తన జీవితంలో మధుర జ్ఞాపకాలకు సంబంధించిన దృశ్యాలు అభిమానులతో పంచుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వీడియోను చూసేయండి.

మరిన్ని వార్తలు