న్యూస్‌ ఏంటి?

3 Jun, 2018 01:21 IST|Sakshi
నిఖిల్‌

‘కిరాక్‌ పార్టీ’ వంటి హిట్‌ చిత్రం తర్వాత నిఖిల్‌ నటిస్తోన్న తాజా సినిమా ‘ముద్ర’. లావణ్యా త్రిపాఠి కథానాయిక. టి.ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో ఆరా సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మూవీ డైనమిక్స్‌ ఎల్‌.ఎల్‌.పి. బ్యానర్‌లపై కార్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌ పుట్టినరోజు (జూన్‌ 1) సందర్భంగా ‘ముద్ర’ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో నిఖిల్‌ రిపోర్టర్‌ పాత్రలో కనిపించబోతున్నారు.

ఫస్ట్‌ లుక్‌లో తన చేతిలో కెమెరాతో కనిపించారు నిఖిల్‌. జర్నలిజమ్‌లో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారట. న్యూస్‌ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ‘‘మా సినిమా ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు, సంగీతం: శ్యామ్‌ సి.ఎస్, కెమెరా: సూర్య.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు