పగ... ప్రతీకారం

1 Mar, 2017 05:24 IST|Sakshi
పగ... ప్రతీకారం

నిఖిల్, రీతూ వర్మ జంటగా శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. హిందీ భామ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ జరిపిన చిత్రీకరణతో 90 శాతం సినిమా పూరై్తంది.

హైదరాబాద్‌లో జరగనున్న చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణంతా పూర్తవుతుంది. నిఖిల్‌–సుధీర్‌వర్మ కలయికలో వచ్చిన ‘స్వామి రారా’ తరహాలో ‘కేశవ’ కూడా ట్రెండ్‌ సెట్టింగ్‌ సబ్జెక్ట్‌. మే 12న చిత్రాన్ని విడుదల చేయాలనేది మా ప్లాన్‌’’ అన్నారు. ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రమిది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: యం.ఆర్‌. సన్నీ, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.