జ్ఞాపకశక్తి కోల్పోయిన యువతిగా నికిషా పటేల్

26 Nov, 2013 03:19 IST|Sakshi
 ఉత్తరాది భామ నికిషాపటేల్ జ్ఞాపక శక్తిని కోల్పోయారట. యుక్త వయసులో ఆమెకు మెమొరీలాస్ అవ్వడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? పులి చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ గ్లామర్ డాల్ ప్రస్తు తం కోలీవుడ్‌పై దృష్టి సారిస్తోంది. తమిళం లో పలు అవకాశాలను చేజిక్కించుకున్న బబ్లీ హీరోయిన్ నారదన్ చిత్రంలో నకులన్‌తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో జ్ఞాపక శక్తిని కోల్పోయిన యువతిగా నటిస్తోందట. దీని గురించి ఈ బాలీ వుడ్ భామ తెలుపుతూ నారదన్ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు చెప్పింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చిత్రమని తెలిపింది.
 
  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోందని వెల్లడించారు. నకులన్‌తో నటిస్తున్న అనుభవం గురించి అడగ్గా ఆయన మంచి ఎనర్జిటిక్ నటుడన్నారు. అంతా కుటుంబ సభ్యులుగా కలిసిపోయి నటిస్తున్నట్లు చెప్పారు. నారదన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రంతోపాటు గౌతమ్ కార్తీక్ సరసన ఎన్నమో ఏదో చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులోను తనది చాలా బలమైన పాత్ర అని వివరిం చారు. గౌతమ్ కార్తీక్ గర్ల్ ఫ్రెండ్‌గా నటిస్తున్నట్లు తెలి పారు. మరో ద్విభాషా చిత్రం రంభ, ఊర్వశి, మేనకలో కూడా నటిస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథా చిత్రమని నికిషా పటేల్ వెల్లడించారు.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి