సైబర్ నేరాల ప్రభావం

10 Jun, 2014 02:21 IST|Sakshi
సైబర్ నేరాల ప్రభావం

 ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఆశయంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. మంజునాధ్‌లో మంచి దర్శకుడు ఉన్నాడనే నమ్మకంతో ఈ చిత్రానికి అవకాశం ఇచ్చాను. యువతరానికి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది’’ అని మధుర శ్రీధర్ చెప్పారు. గోతెలుగు.కామ్ సమర్పణలో పీఎల్ క్రియేషన్స్, షిర్టిసాయి కంబైన్స్‌పై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’. పీబీ మంజునాధ్ దర్శకుడు. చైతన్యకృష్ణ, అడవి శేష్, కమల్ కామరాజు, మహత్ రాఘవేంద్ర,  నిఖితా నారాయణ్, స్వాతీ దీక్షిత్, జాస్మిన్ ముఖ్య తారలు.
 
  చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరపరచిన ఈ చిత్రం ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న లగడపాటి శ్రీధర్, మల్టీ డైమన్షన్ వాసు, నీలకంఠ తదితరులు ప్రచార గీతం బాగుందని, సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. బుర్రకథ నేపథ్యంలో సోషల్ నెట్‌వర్క్ గురించి తెలిపే పాట ఇదని రఘు కుంచె చెప్పారు. మానవ సంబంధాలకంటే సోషల్ మీడియాకే నేటి తరం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, సైబర్ నేరాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే కథాంశాన్ని వినోద ప్రధానంగా తెరకెక్కించామని దర్శకుడు చెప్పారు.