ఇప్పుడు సినీ దర్శకుల వంతు..

28 Oct, 2015 19:36 IST|Sakshi
ఇప్పుడు సినీ దర్శకుల వంతు..

ప్రముఖ హేతువాది, రచయిత కల్బుర్బీ సహా ప్రజాస్వామిక వాదుల హత్యలు, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విపరీత పరిస్థితులను నిరసిస్తూ పలువురు రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వదులుకుంటున్న తరుణంలో.. తొమ్మిది మంది సినీ దర్శకులు తమకు లభించిన జాతీయ అవార్డులను తిరిగిస్తున్నట్లు ప్రకటించారు.

'బాంబే టాకీస్', 'ఖోస్లా కా ఘోస్లా', 'ఒయ్ లక్కీ లక్కీ..' తదితర హిట్ సినిమాల దర్శకుడు దివాకర్ బెనర్జీ సహా తొమ్మిది మంది దర్శకులు జాతీయ అవార్డులను వదులుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. గజేంద్ర చౌహాన్ ను చైర్మన్ గా తొలగించాలన్న పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థుల డిమాండ్ కు మద్దతు తెలపడంతోపాటు కల్బుర్గీ హత్యకు నిరసనగా తామీ పనికి పూనుకున్నట్లు వారు చెప్పారు. బెనర్జీ సహా అవార్డును వెనక్కిచ్చిన వారిలో లిపికా సింగ్, నిష్టా జౌన్, ఆనంద్ పట్వర్ధన్, కీర్తి నఖ్వా, హర్షా కులకర్ణి, హరి నాయర్ తదితరులున్నారు.