సినిమా అదిరింది అంటున్నారు

14 Jul, 2019 00:31 IST|Sakshi
అనన్యా సింగ్, సందీప్‌ కిషన్, దయా పన్నెం, శివ చెర్రి

– సందీప్‌ కిషన్‌

‘‘కంటినిండా నిద్రపోయి సుమారు వారమైంది. ఎంతో నమ్మి ‘నిను వీడని నీడను నేనే’ సినిమా తీశాం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని టెన్షన్‌ పడ్డాను. మొన్న మేమంతా తిరుమలకు వెళ్లాక, టెన్షన్‌ తట్టుకోలేక ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశా. శుక్రవారం ఉదయం ఆట పడ్డాక ఫోన్‌ ఆన్‌ చేశా’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. కార్తీక్‌ రాజు దర్శకత్వంలో సందీప్‌ కిషన్, అనన్యాసింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్‌ సుంకర సమర్పణలో దయా పన్నెం, సందీప్‌ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

తొలి ఆట నుంచి సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో టపాసులు కాల్చి సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు యూనిట్‌. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘శుక్రవారం ఒంటిగంటకు ఫోన్‌ స్విచ్ఛాన్‌ చేశా. చాలామందికి ఫోన్లు చేశా.. ‘చాలా మంచి సినిమా తీశారు భయ్యా. ఫస్టాఫ్‌ అదిరింది. లాస్ట్‌లో ఎమోషన్‌ అదిరిపోయింది, సినిమా సూపర్‌గా ఉంది.. చివరలో ఏడ్చాం’ అంటూ చాలా పాజిటివ్‌గా చెబుతుంటే సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి, కలెక్షన్లు బావున్నాయని చెబుతున్నారు.

ఈ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి సోమవారం నుంచి సక్సెస్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో తీసిన తొలి చిత్రం సక్సెస్‌ఫుల్‌ అయింది. షోలన్నీ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. మరికొన్ని షోలు పెంచమని అడుగుతున్నారు’’ అని దయా పన్నెం అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా హిట్‌ కావడంతో సంతోషంగా ఉన్నా. సందీప్‌ కిషన్‌ ఈజ్‌ బ్యాక్‌ విత్‌ ఎ బ్యాంగ్‌. మా టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు అనన్యా సింగ్‌. నిర్మాత సుప్రియ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్‌ పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో రెండు!

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ