నిను వీడను

24 Nov, 2018 00:09 IST|Sakshi
సందీప్‌ కిషన్, అన్యా సింగ్‌

‘నిను వీడను నీడను నేనే.. కలగా మిగిలిన కథ నేనే’... దాదాపు 50 ఏళ్ల క్రితం విడుదలైన ‘అంతస్తులు’ చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ సంగీతప్రపంచంలో నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు సందీప్‌ కిషన్‌కి నీడకీ లింకు కుదిరింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘నిను వీడని నీడను నేనే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ద్వారా సందీప్‌ నిర్మాతగా కూడా మారారు. దయా పన్నెంతో కలిసి ఆయన స్థాపించిన వెంకటాద్రి టాకీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న తొలి చిత్రం ఇది.

సందీప్‌ కిషన్, అన్యా సింగ్‌ జంటగా కార్తీక్‌ రాజు దర్శకత్వంలో దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రషెస్‌ చూసి విస్తా డ్రీమ్‌ మర్చంట్స్‌ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. కార్తీక్‌ రాజు మాట్లాడుతూ– ‘‘సూపర్‌ నేచురల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. 

ఎవరూ టచ్‌ చేయని డిఫరెంట్‌ పాయింట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో సినిమా రూపొందిస్తున్నాం.   త్వరలోనే ట్రైలర్, పాటల విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఆరు రోజుల షూటింగ్‌ మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. మా సినిమా విడుదల చేయడానికి ముందుకొచ్చిన విస్తా మర్చంట్స్, అనీల్‌ సుంకరగారికి థ్యాంక్స్‌’’  అన్నారు దయా పన్నెం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శివా చెర్రీ, సీతారాం, కిరుబాకరన్, కెమెరా: ప్రమోద్‌ వర్మ, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు