తేదీ కుదిరింది

25 Jan, 2020 00:29 IST|Sakshi
అనుష్క

అనుష్క నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఈ నెల 31న విడుదల కావాలి. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్‌ డేట్‌ను నిర్ణయించారని సమాచారం. అనుష్క, మాధ వన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిశ్శబ్దం’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్, హాలీవుడ్‌ క్రాస్‌ ఓవర్‌ (రెండు ప్రాంతాల నటీనటులు కలసి నటించడం) చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా